Home Telangana రెబ్బన ఎస్సై భవాని సేన్ గారి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

రెబ్బన ఎస్సై భవాని సేన్ గారి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

0
0

రెబ్బెన పొలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై భవాని గారు వారి సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత పాటిస్తూ హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనాలు నడిపిన వారికి ప్రజా ప్రతినిధుల ద్వారా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ…పుష్పగుచ్చలు అందజేశారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనదారులకు ఎస్సై భవాని సేన్ గారు వారికి జరిమాణ విధించి రోడ్డు భద్రత నిబంధనలు గురించి అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పకుండా పాటించవలసిన నియమ-నిబంధనలు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపాలన్నారు. మైనర్ బాలురు వాహనాలు నడపరాదన్నారు.సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపరాదు. వాహనాలు ఓవర్ స్పీడ్ తో,ఓవర్ లోడ్ తో నడపరాదన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలన్నారు. మద్యం సేవించి, వాహనాలు నడిపితే జరిమనలతో పాటు, జైలు శిక్ష విధించబడుతుందన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై భవాని సేన్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా-ప్రతినిధులు రెబ్బెన పోలీసులు పాల్గొన్నారు.

ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం,ఆసిఫాబాద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here