Home Telangana యాసంగి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్...

యాసంగి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ కాముని శ్రీనివాస్

0
0

చిన్నకోడూరు రాష్ట్ర ప్రభుత్వం యాసంగి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ కాముని శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి వరి సాగు ఎక్కువ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వానకాలం సీజన్ లో కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ గ్రామ గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, ప్రాథమిక కేంద్రాలు , ఎలాగైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారో ఇప్పుడు యాసంగి సీజన్ లో కూడా అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు నిన్న వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో అన్నారు. యాసంగి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్నకోడూరు ఏఎంసి చైర్మన్ కాముని శ్రీనివాస్ గారు. వారు మాట్లాడుతూ ఇంతటి కరోనా సంక్షోభంలో కూడా,ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ, రైతుల పట్ల రైతు బాంధవుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని మరోసారి నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి చిన్నకోడూరు మండల పరిధిలో అటు రంగనాయక సాగర్, ఇటు అన్నపూర్ణ రిజర్వాయర్లోకి పుష్కలంగా నీటిని విడుదల చేసినందున మరియు మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో చెరువులు కూడా నిండుకుండను తలపిస్తున్న తరుణంలో ఈసారి రైతులు అందరు కూడా వరి పంట ఎక్కువగా వేసినందున ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ఆఖరి గింజ వరకు కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది కావున మా చిన్నకోడూరు మండలం లో ఆఖరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని అన్నారు. కావున ఇంత మంచి నిర్ణయం తీసుకున్నా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, రైతుల పక్షాన కృతజ్ఞత వందనాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, మరియు మార్కెట్ కమిటీ పాలకవర్గం ఉన్నారు….. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here