Home Telangana మాత శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

మాత శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

0
0

జయశంకర్ భూపాలపల్లి మాతా,శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ న్యూఢిల్లీ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రిని సందర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సౌకర్యాల కల్పనకు ముఖ్యంగా మాతాశిశు సంరక్షణ కొరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా అందజేసిన నిధులతో ఏర్పాటుచేసిన వైద్య పరికరాలను పరిశీలించారు. మరియు ఆసుపత్రిలో నియమించిన వైద్య సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో న్యూట్రిషన్ రిహాబిలిటీషన్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబడి నీతి అయోగ్ చే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ గా గుర్తించబడి ప్రత్యేకంగా అభివృద్ధి సాధించేందుకు వివిధ సంస్థల సహకారం తీసుకుంటున్న దానిలో భాగంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ న్యూఢిల్లీ వారి సహకారంతో మాతాశిశు సంరక్షణ కోసం నూతనంగా నిర్మించబడిన జిల్లా ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టామని అలాగే పౌష్టికాహార లోపంతో శారీరక,మానసిక ఎదుగుదల సరిగా లేని చిన్నారులు మరియు రక్తహీనతతో బాధపడే గర్భిణీలు,బాలింతలకు కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందని మూడు నెలల్లో భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రానున్నదని అన్నారు. అత్యంత వెనుకబడిన ఈ జిల్లా అభివృద్ధికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందు ముందు కూడా సహకరించాలని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులను ఈ సందర్భంగా కోరారు.
అంతకుముందు ఐటిడిఎ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి హనుమంతు జెండగే పవర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులతో కలిసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులతో జిల్లా ఆస్పత్రిలో కల్పించిన సౌకర్యాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్ సురభి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ దాస్, సిఎస్ఆర్ హెడ్ రాజా రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుధార్ సింగ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.తిరుపతి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె.సామ్యూల్, డిఆర్డిఓ పురుషోత్తం, డిపిఓ ఆశాలత, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిరంజన్, ఏటూర్ నాగారం సిహెచ్ సి వైద్యులు డాక్టర్ సురేష్, నీతి అయోగ్ జిల్లా కోఆర్డినేటర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here