Home Telangana మల్లన్న పాలెం గ్రామంలో,,కుట్టు మిషన్ల శిక్షణ ముగింపు కార్యక్రమం

మల్లన్న పాలెం గ్రామంలో,,కుట్టు మిషన్ల శిక్షణ ముగింపు కార్యక్రమం

0
0

ముదిగొండ మండలం, మల్లన్న పాలెం గ్రామంలో,,కుట్టు మిషన్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీపీ సామినేని హరిప్రసాద్ మహిళల ఆర్థిక భరోసాకు దోహదం ముదిగొండ మహిళల ఆర్థిక భరోసా కుట్టుమిషన్లు ఎంతో దోహదపడతాయని ఎంపీపీ సామినేని హరిప్రసాద్ అన్నారు జన శిక్షణ సంస్థాన్ చేయూతతో మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణా కార్యక్రమం మండలపరిధిలో మల్లన్న పాలెం గ్రామంలో గత నెలరోజుల క్రితం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ శిక్షణా కార్యక్రమం సోమవారంతో ముగిసింది.ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మహిళలు కుట్టుమిషన్లు నేర్చుకొని జీవితాలను చక్కదిద్దుకోవాలన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ సామాజిక రాజకీయ రంగాల్లో రాణించాలన్నారు.జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్లు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి నేర్పించటం హర్షనీయమని ఈసందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ చిలకల విజేతరామకృష్ణను ఆయన అభినందించారు.అనంతరం కుట్టు మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు సర్టిఫికెట్లను ఆయన అందజేశారు ఈకార్యక్రమంలో జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్స్ రాధాకృష్ణ రజియాబేగం కుట్టు మిషన్ ట్రైనింగు టీచర్ జానిబి గ్రామపంచాయతీ సర్పంచ్ చిలకల విజేతరామకృష్ణ ఉపసర్పంచ్ ఎస్కే రహంతుల్లా పంచాయతీ సెక్రెటరీ సిహెచ్ వీరభద్రం ఎంపీటీసీ సభ్యులు కోయ రమేష్ పమ్మి పంచాయతీ సర్పంచ్ కొండమీద సువార్త రైతు సమన్వయసమితి మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ వేముల శ్రీనివాస్ నేలకొండపల్లి ఏఎంసి డైరెక్టర్ బంక మల్లయ్య మల్లన్నపాలెం గ్రామం మాజీ సర్పంచులు కొల్లేటి నాగేశ్వరరావు చిర్రా వెంకటేశ్వర్లు కొల్లేటి జ్యోతి కొల్లేటి శ్రీనివాసరావు సిపిఐ(ఎం) నాయకులు కొల్లేటి వెంకటేశ్వర్లు మహిళలు గ్రామపెద్దలు పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ ఛానల్ ముదిగొండ ఆర్ పి రమేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here