వరంగల్ రూరల్ జిల్లా: పర్వతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్ మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఐదు సంవత్సరాలు పూర్తయిన ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, దేశంలో జిఎస్టి దెబ్బకు మాత్రం ఆరు లక్షల 80 వేల పరిశ్రమలు మూతబడి ఆరు కోట్ల ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారన్నారు. అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం 2014లో చేసిన samagra కుటుంబ సర్వే (SKS) ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల వరకు నిరుద్యోగులు ఉంటారని అంచనా వేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి ఇలాంటి ప్రతిపాదనలు రూపొందించ లేదన్నారు. తెరాస బిజెపి పార్టీలు నిరుద్యోగ యువతను తీవ్రంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.కరోనా లాక్డౌన్ లో అదాని సంపద 75%, అంబానీ సంపద 35 శాతం పెరిగింది.కానీ దేశ సంపద మాత్రం మైనస్ 23 శాతం కి పడిపోయింది అన్నారు. ఈ దిగజారిన ఆర్థిక వ్యవస్థలో ఓ వైపు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, కుటుంబ ఆదాయాలు, వేతనాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.