Home Telangana బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి… లేకుంటే రూ.1000 జరిమానా

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి… లేకుంటే రూ.1000 జరిమానా

0
0

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్ సూచన

నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ యల్.శర్మన్ సూచించారు.
నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. కచ్చితంగా మాస్కుతో పాటు భౌతిక దూరం పాటించి, చేతులను శానిటైజేషన్‌ చేసుకుంటుండాలన్నారు. నిబంధనలను పాటించకుండా ఎవరు నిర్లక్ష్యం చేసిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద రూ. వెయ్యి జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.రోడ్డు పై ఉమ్మేసినా జరిమానా తప్పదన్నారు.
జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది సైతం మాస్కులు తప్పనిసరి ధరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, జనావాసాలు, మార్కెట్లు, బస్టాప్‌లు, ఆలయాలు, రైతుబజార్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కిరణం, బట్టల దుకాణాలు తదితర వాటితో పాటు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్స్‌ తదితర అన్ని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లలో కూడా మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.మాస్కును ముక్కు, నోరును కవర్‌ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదమ దగ్గర మాత్రమే మొక్కుబడిగా మాస్కు ధరించినా మాస్కు ధరించని వారికి విధించే జరిమానానే వారికి కూడా వర్తిస్తుందన్నారు.
ఇట్టి బాధ్యతలను పోలీస్ శాఖ కు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రతిఒక్కరూ బయటకు లేదా ప్రజల మధ్యకు వస్తే విధిగా మాస్కు ధరించాల్సిందేనన్నారు.నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here