కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్: పట్టణంలో * నేడు భగత్ సింగ్, సుక్ దేవ్ మరియు రాజ్ గురు ను 1931 వ సంవత్సరం మార్చి 23 న బ్రిటిష్ పాలకులు వీరిని ఉరిదీయడం జరిగింది. మార్చి 23 ను బలిదాన్ దివాస్ గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా పతంజలి యోగ్ పీఠ్ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో ఎస్పియం క్రికెట్ మైదానంలో యోగ శిబిరం అనంతరం ఎస్పియం క్రికెట్ మైదానం నుంచి రాజీవ్ చౌక్ మీదుగా ఓల్డ్ హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ యువత భగత్ సింగ్ యొక్క ఆత్మ బలిదానం నుంచి స్ఫూర్తి పొంది వ్యసనాలకు దూరంగా ఉండి దేశ సేవకు అంకితం కావాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పతంజలి యోగ్ పీఠ్ దక్షిణ భారత దేశ పర్యవేక్షకులు శ్రీ అశోక్ ఆర్య గురుజి, మాజీ కౌన్సిలర్ ముద్దసాని శ్రీరామ్ విశాల్ . రామ్ మరియు యోగ అభ్యాసకులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్..