తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం నరేష్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో 70% నుంచి 80% శాతం ఉన్న బీసీల అభివృద్ధి కోసం తగిన కేటాయింపు చేయకపోవడం చాలా దురదృష్టకరం అని ఆయన అన్నారు. కరోన ధాటికి దేశంలో కరువు విలయతాండవం చేస్తున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసేందుకు బడ్జెట్ రూపకల్పనలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు. పేదరికంలో అధిక శాతం ప్రజలు బీసీలే ఉన్నారని వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.