రైతు తలారి రాజయ్య కు నష్టపరిహారం అందేలా చూడండి
-పల్లా బుచ్చయ్య,రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు
జయశంకర్ భూపాలపల్లి,
మహాదేవపూర్ మండల కేంద్రంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ పరిధిలో ముంపుకు గురవుతున్న భూయజమానులకు నష్టపరిహారం ఇప్పించుట గురించి రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు.రైతు ను రాజు చేయడమే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని,తెలంగాణ లోని బీడు భూములను సస్యశామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ముంపుకు గురవుతున్న రైతుల భూములకు నష్టపరిహారం ఇప్పించారని,తెలంగాణ గర్వించే విధంగా కాళేశ్వరం పూర్తి చేశారని పల్లా బుచ్చయ్య అన్నారు.కానీ లాల్ తప్పుడు తడకలతో బీర సాగర్ గ్రామ రైతు తలారి రాజయ్య కు నష్టపరిహారం అందలేదని,ఈ విషయం పై జిల్లా కలెక్టర్ ను కలుస్తామని అన్నారు..మహాదేవపూర్ మండలంలోని బీర సాగర్ గ్రామ శివారులోని సర్వే నెం 25,25/3నందు ఎ1-31గుంటల వ్యవసాయ భూమి మేడి గడ్డ ప్రాజెక్ట్ లో పోతున్నట్లుగా కొలతలు నిర్వహించి సర్వే అధికారులు 639,640 నెంబర్ గల బండలు పాతడం జరిగిందని,లాల్ నిర్లక్యంతో తలారి రాజయ్య పేరు ఎంజాయ్ మెంట్ లిస్ట్ లో పెట్టలేదని,ముంపుకు గురవుతున్న ఏ రైతు నష్టపరిహారం అందలేదని బాధ పడవద్దని,తలారి రాజయ్య కు నష్టపరిహారం అందేంతవరకు రైతు పక్షాన నిలబడుతామని పల్లా బుచ్చయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి,పలిమేల మట్టి పాపారావు,తదితరులు పాల్గొన్నారు.