Home Telangana ప్రజా సమస్యల పై కల్లూరు RDO గారి తో మాట్లాడిన మద్దిశెట్టి సామెలు.

ప్రజా సమస్యల పై కల్లూరు RDO గారి తో మాట్లాడిన మద్దిశెట్టి సామెలు.

0
0

తల్లాడ ఏనుకురు మండలాల పరిధిలోని క్రషర్ మిల్లులు వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు అని DCWS తరుపున నిన్న ధరకాస్తు ఇవ్వటం జరిగింది. స్పందించిన RDO గారు తల్లడ MRO గారికి, ఎన్కురు MRO గారికి పూర్తి విచారణ చేసి రిపోర్ట్ అందచేయాలని లేక రాయటం జరిగింది. RDO గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తు పెనుబల్లి,సత్తుపల్లి, ఎన్కురు మండలాల పరిధిలోని జాయింట్ సర్వే పెండింగ్ ఉన్న ఉప్పు గుంట జాయింట్ సర్వే నిర్వహించాలని అడగటం జరిగింది. రేజర్ల గుట్ట కి సంబందించి ప్రజలు ఇబ్బందులు గురికాకుండా చూడాలని మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు పరుస్తూ ఇల్లు నూతనం గా కట్టించి ఇవ్వలని కోరటం జరిగింది.ఈ కార్యక్రమం లో పలగానీ శ్రీనివాసరావు లక్ష్మ తండ గిరిజనులు ఇతరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here