Home Telangana ప్రజా సమస్యలపై కల్లూరు RDO కి వినతి పత్రం

ప్రజా సమస్యలపై కల్లూరు RDO కి వినతి పత్రం

0
0

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు,సత్తుపల్లి,పెనుబల్లి,మండలాల కి సంబందించిన ప్రజా సమస్యలపైన కల్లూరు RDO గారికి వినతి పత్రం అందజేసిన DCWS మరియు HRCI టీమ్.

ప్రధానంగా ఇప్పుడు కల్లూరు కి సంబంధించి
1.కిన్నెర వెంకటేశ్వర్లు,కోట పుళ్ళమ్మ పట్ట భూములపై కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే నిర్వహించి వాళ్ళకి అప్పచెప్పలని,
2. సత్తుపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడెం లో నివాసం ఉంటున్న మడకం చలపతి మరియు 70 కుటుంబాలకు గౌరవ హైకోర్టు ఆదేశాల స్టే ఆర్డర్ ప్రకారం వాళ్ళకి పక్కా ఇళ్లు, పోడు భూములకు పట్టాలు, మంచినీటి సదుపాయం, కులం సర్టిఫికేట్ లు మంజూరు చేయాలని,
3. తల్లాడ పరిధిలోనీ నరసరావు పేట గోపాల పేట అన్నారి గూడెం గార్లోడ్ బాలం పేట తదితర గ్రామాలకు సంబందించిన అటువంటి రైతులు క్రషర్ మిల్లు )(కంకర మిల్లు)వల్ల ఆ లారిలలో అవి తోలడం వల్ల ఆ దుబ్బ )(పొల్యూషన్) ల వల్ల పంట మిర్చి,పత్తి వరి పొలాలు పంటలు నష్ట పోయి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు అని దీని మీద రైతులకి న్యాయం జరిగేలా చూడాలని పరిమిషన్ లేకుండా మిల్లులు నడుపుతున్న అటువంటి యాజమానుల పై చర్యలు తీసుకోవాలి అని వినతి పత్రం ఇవ్వటం జరిగింది.దీంతో పాటు సింగరేణి సత్తుపల్లి, రేజర్ల కి సంబందించి బీసీ కాలనీ, గుట్ట దగ్గర ఉండే నివాసులు 70 ఇళ్లులు గత 7 రోజులు గా నిరాహార దీక్ష చేస్తున్న అటువంటి సందర్భంగా వాళ్ళకి పక్క ఇల్లు మంజూరు చేయాలని చెప్పి కోరటం జరిగింది.తాత్కాలికంగా మరమత్తులు చేయమని చెప్పి ఆదేశాలు వచ్చిని అని కచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసేలా చూస్తామని RDO గారే హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఇనపనురి నవీన్, పలగాని శ్రీనివాసరావు, రాష్ట్ర వైస్ చైర్మన్ ఇనపనురి శ్రీనివాస్, కోట పుల్లమ్మ, కిన్నేర వెంకటేశ్వర్లు బీరువంచ సర్పంచ్ తదితరులు పాల్గొనటం జరిగింది.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here