Home Telangana  పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన మానసిక,శారీరక ఎదుగుదల ఉంటదన్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

 పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన మానసిక,శారీరక ఎదుగుదల ఉంటదన్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

0
0

జయశంకర్ భూపాలపల్లి పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన మానసిక,శారీరక ఎదుగుదల ఉంటదని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఈనెల 16 నుండి 30 తేదీ వరకు స్త్రీ మరియు శిశు సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న పోషక పక్వాడా కార్యక్రమంలో భాగంగా సోమవారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో సంబంధిత శాఖల అధికారులతో చిన్నారులు, బాలింతలు,గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో చిన్నారులు,గర్భిణీలు,బాలింతలకు ఐసిడిఎస్ ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారం మరియు పౌష్టికాహార ఆవశ్యకతపై మహిళలకు, చిన్నారుల తల్లిదండ్రులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే శారీరక,మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, మహిళలు గర్భం ధరించిన నాటి నుండి అంగన్వాడి టీచర్లు మరియు వైద్యుల సలహాతో పౌష్టికాహారం తీసుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండడంతోపాటు పుట్టబోయే పిల్లలకు కూడా ఆరోగ్యంగా జన్మనిచ్చే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. ఐసీడీఎస్ సిబ్బంది గ్రామాల వారీగా చిన్నారుల బరువును లెక్కిస్తూ వయస్సుకు తగ్గ బరువు పెరిగేలా పౌష్టికాహారం అందించాలని అన్నారు. ముఖ్యంగా పోషక పక్షం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కార్యక్రమాలను నిర్వహించి చిన్నారులు,గర్భిణులు,బాలింతలు పోషకాహారలోపంతో రక్తహీనత వ్యాధులకు గురికాకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్దిష్టమైన పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపట్టడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ గార్డెన్ కార్యక్రమం చేపట్టి అవసరమైన ఆకుకూరలను, కూరగాయలు,పండ్లను పండించేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడి సూపర్వైజర్లు,టీచర్లతో పాటు పంచాయతీరాజ్ సంస్థలలో స్వయం సహాయకమహిళా సంఘాల సభ్యులు,గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పౌష్టికాహారం అందించడం మరియు పౌష్టికాహారం వలన కలిగే లాభాలను వివరించాలని అన్నారు. ఈ సందర్భంగా పౌష్టికాహార కల్పనపై ప్రతిజ్ఞ చేసి పోషక పక్షం పోస్టర్ ను అధికారులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శ్రీదేవి, జిల్లా గ్రామీనాభివృద్ధి అధికారి పురుషోత్తం, ముఖ్య ప్రణాళికాధికారి కె.సామ్యూల్, జిల్లా పౌరసరఫరాలఅధికారి గౌరీశంకర్, డిపిఆర్ఓ రవికుమార్, బిసిడిఓ శైలజ, ఎస్సిడిఓ సునీత, మైనారిటీ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్లు, డివైఎస్ఓ సునీత, సిడిపిఓలు రాధిక,అవంతిక, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మమతాదేవి, పోషక్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ యోచన, అంగన్వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here