కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి గాంధీ చౌక్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు హెల్పింగ్ హాండ్స్ క్రికెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.చత్తీస్ గడ్ లోని సుక్మా బీజాపూర్ పరిధిలో మావోయిస్టుల కాల్పుల్లో 24 మంది జవాన్లు వీరమరణం పొందటంతో,..అమర వీర జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని హెల్పింగ్ హాండ్స్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణం రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి సాయంత్రం 7-30 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగింది. ఈ కార్యక్రమానికి ఎస్సై వెంకటేశ్వర్లు కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్, కౌన్సిలర్లు మదన్, జై చందర్,బంక శివ పాల్గొన్నారు.హెల్పింగ్ హాండ్స్ అప్ క్రికెట్ క్లబ్ సభ్యులు మధు, కిరణ్, నాగరాజు, గోరంట్ల సంతోష్, దాసరి లక్ష్మణ్, సుదర్శన్, ప్రదీప్, కిరణ్ రాచకొండ, రమేశ్, జే. సతీష్, అజయ్, సందీప్, వంశీ, ఎమ్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం,ఆసిఫాబాద్