పదవ తరగతి దూరవిద్యలో పరీక్ష ఫీజు కట్టడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నా భద్రాచలం పట్టణానికి చెందిన బి. మణి అనే విద్యార్థికి జేడీ ఫౌండేషన్ సభ్యుడు శ్రీ మావూరపు విజయ్ (హైదరాబాద్) వారి సహకారంతో ఈ విద్యార్థికి 1,250 రూపాయలు ఫీజు చెల్లించారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ బాధ్యులు శ్రీ మురళీ మోహన్ కుమార్ మాట్లాడుతూ ఏ పేద విద్యార్థు లు ఫీజు కట్ట లేక చదువు ఆగిపోకూడదు అని ఉద్దేశంతో ఈ సహకారం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీ పవన్ కుమార్ ,శ్రీ కడలి నాగరాజు శ్రీ అంబికా సురేష్ తో పాటు రక్షణ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ గుమ్మడి రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్