Home Telangana పూడ్చని భగీరథ గుంత

పూడ్చని భగీరథ గుంత

0
0

– కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
– ప్రమాదకరంగా మారిన వైనం

పర్వతగిరి: మండలంలోని ఇస్లావత్ తండా గ్రామ సమీపంలో రెడ్లవాడ నుంచి పర్వతగిరి మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు పై మిషన్ భగీరథ పథకంలో భాగంగా కల్వర్టు పక్కన పెద్ద గుంత తవ్విన అనంతరం దానిని అలా వదిలేశారు. అయితే ఈ రోడ్డు గుండా రెడ్లవాడ, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్ వరకు ప్రతి రోజు వాహనదారులు ప్రయాణికులు వెళ్తుంటారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఫైబర్ కేబుల్, భగీరథ పథకంలో భాగంగా కాంట్రాక్టర్ ఈ గుంత ను పూడ్చకుండా అలాగే వదిలేశాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన గుంతను వెంటనే పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు , వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here