Home Telangana నేనున్నంత వరకు సిద్దిపేట నం.1

నేనున్నంత వరకు సిద్దిపేట నం.1

0
0

సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన యువత ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి

ఇక్కడి ప్రజలకు ఎంత చేసినా తక్కువే

వాతలు, కోతలతోనే వెళ్లదీస్తున్న బీజేపీ

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట‘‘నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన సిద్దిపేట ప్రాంతం అన్నింటింలో ఆదర్శంగా ఉండాలనుకుంటాను.

నేను ఉన్నంతకాలం సిద్దిపేట నంబర్‌వన్‌ స్థానంలోనే ఉంటుంది’’ అని ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు అన్నారు. తనను లక్ష మెజారీటితో గెలిపించిన ప్రజలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఎప్పుడు వాతాలు, కోతలతోనే సర్దిచెబుతూ.. నిధుల్లో కోతలు, ఉద్యోగాలకు వాతలు పెడుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు.గురువారం సాయంత్రం సిద్దిపేట పట్టణంలోని ఓపెన్‌ ఆడిటోరియంలో పట్టణ యువత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఇతర జిల్లాల్లో సిద్దిపేట అభివృద్ధి గురించి మాట్లాడి మెప్పు పొందాలని కోరుకుంటారని, కానీ సిద్దిపేటలో అభివృద్ధి జరుగుతుందనే విషయజ్ఞానం వారికి అర్థ కావడం లేదన్నారు. ఒక్క సిద్దిపేటలోనే కాదు ఏ జిల్లానైనా అభివృద్ధి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.ప్రత్యేక తెలంగాణలో ఇంతటి అభివృద్ధి జరిగిందన్నారు. నాడు న్యూస్‌ పేపర్లలో బీడులు బారిన భూములు అని హెడ్‌లైన్లు చదివే వాళ్లం, కానీ ఇప్పుడు పచ్చటి పొలాల్లో గోదావరి నీళ్లు, వాగుల్లో గోదావరి గలగల అని హెడింగులు చదువుతున్నామన్నారు.తెలంగాణ వచ్చాక 403 ఆలయాల కోసం రూ.78 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని తెలిపారు. అభివృద్ధి అంటే రోడ్లు, చెక్‌ డ్యాంలు, నిర్మాణాలు చేపట్టడబే కాదని, ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడడమని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు శానిటైజర్లు, ఐసోలేషన్‌ కిట్‌లు అందిస్తున్నామన్నారు.సిద్దిపేట మున్సిపాలిటీలో 43 సీట్లు గెలవాలిసిద్దిపేట మున్సిపాలిటీలో 43 సీట్లు టీఆర్‌ఎస్‌ పార్టే గెలవాలని మంత్రి అన్నారు. సిద్దిపేట గడ్డలో ఇతర పార్టీలకు చోటు లేదని నిరుపించాలని మంత్రి యువతను కోరారు. సిద్దిపేట మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికల్లో 43 వార్డుల్లో అన్ని సీట్లలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించాలన్నారు. అందుకోసం యువత కష్టపడలన్నారు. ఈ సారి చదువుకున్న యువతకు ఎక్కువ అవకాశం ఇస్తానన్నారు.పట్టణంలోని యువకులు అంత సిద్దిపేట అభివృద్ది గురించి వాట్సాఫ్‌ స్టేట్‌సల ద్వారా ప్రజలకు చూపించలన్నారు. 15 రోజులు మీ వాట్సా్‌పలో ఇదే ఉండాలన్నారు. ఎవరికి సీటు వచ్చిన పార్టీ కోసం పనిచేయాలన్నారు. టికెట్‌ రానివాళ్లు దిగులు చెందకుండ పార్టీ గురించి కష్టపడి పార్టీని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు, యువత పాల్గొన్నారు…… తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here