Home Telangana నిషేధిత అంబర్ జర్ధా, గుట్కా ప్యాకెట్ల పట్టివేత

నిషేధిత అంబర్ జర్ధా, గుట్కా ప్యాకెట్ల పట్టివేత

0
0

మెదక్ జిల్లా. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో 1,37,022 రూపాయల విలువగల ప్రభుత్వ నిషేధిత అంబర్ జర్ధా, గుట్కా ప్యాకెట్ల పట్టివేత ఎస్.పి శ్రీమతి చందన దీప్తి ఐ.పి. ఎస్ గారి ఆదేశానుసారం నమ్మదగిన సమాచారం ప్రకారం జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కిరాణం యజమాని వీరమల్లు శ్రీనివాస్ తండ్రి గాలయ్య ప్రభుత్వం నిషేధించినటువంటి అంబర్ జార్ధా, గుట్కా ప్యాకెట్లు వాటి విలువ సుమారు 1,37,022/- రూపాయల విలువ గల గుట్కాలు నిల్వ ఉంచినందున పక్క సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించి పట్టుకోని పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి శ్రీమతి చందన దీప్తి ఐ. పి.ఎస్ గారు మాట్లాడుతూ… శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కిరాణం యజమాని వీరమల్లు శ్రీనివాస్ తండ్రి గాలయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత అంబర్ జర్ధా, గుట్కా ప్యాకెట్ల అమ్మితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భముగా అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత అంబర్ జర్దా, గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచారం ఉంటే డయల్ 100, లేదా మెదక్ జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 73306 71900 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సి.ఐ. శ్రీ.మురళి కుమార్ గారు,టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ. శ్రీ.విజయ్ గారు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here