Home Telangana నిరుపేద మహిళలకు ఆసరా.. జె.డి ఉపాధి భరోసా

నిరుపేద మహిళలకు ఆసరా.. జె.డి ఉపాధి భరోసా

0
0

నిరుపేద మహిళలకు ఆసరా.. జె.డి ఉపాధి భరోసా. భర్తను కోల్పోయిన మహిళ జీవనోపాధి నిమిత్తం జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెప్పుల దుకాణం ఏర్పాటు.

మనిషికి చేపలు ఇవ్వడం కన్నా చేపలు పట్టడం నేర్పిస్తే జీవితంలో ఎదగడానికి మార్గం సుగమం అవుతుందనే నానుడిని నిజం చేస్తున్నారు జెడి పౌండేషన్ భద్రాచలం వారు. ఈ మేరకు నిజమైన హోలీ పండుగ తమ కుటుంబంలో వెల్లివిరిసింది అని భద్రాచలం బుడగ జంగాల కాలనీ కీ చెందిన కొవ్వలి లక్ష్మి తెలిపారు . భద్రాచలం పట్టణానికి చెందిన కోవ్వాలి నరేష్ ఆత్మహత్య చేసుకున్నారు భార్య ముగ్గురు ఆడబిడ్డలు కుటుంబ పెద్దను కోల్పోయి దీన స్థితిలో ఉన్న విషయం మీడియా మిత్రులు మరియు అధికారుల ద్వారా తెలుసుకున్న జెడి ఫౌండేషన్ వారికి ఆ కుటుంబానికి జీవనోపాధి కల్పించడానికి ముందుకు వచ్చారు . ఈ మేరకు ఆదివారం స్థానిక కొర్రజుల గుట్ట పాల కేంద్రం వద్ద ఈ కుటుంబానికి తోపుడు బండి పై చెప్పుల దుకాణాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీ కంభంపాటి సురేష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ కంభంపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ జేడీ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వినూత్నంగా చేపట్టిన ఉపాధి భరోసా కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు డబ్బు ఇవ్వకుండా వారు ఎదగడానికి జీవనోపాధి చూపించటం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం అని కూడా దీనిలో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జెడి జెడి పౌండేషన్ బాధ్యులు శ్రీ కె.మురళీమోహన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి భరోసా ద్వారా ఇప్పటి వరకు 8 కుటుంబాలకు ద ఉపాధి కల్పించామని ఇప్పటివరకూ ఈ కార్యక్రమానికి సహకరించిన సహకరిస్తున్న, సహకరించ బోయే మానవతా మూర్తులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చెప్పుల దుకాణాన్ని శ్రీ అమిత్ వర్మ (DBS-సింగపూర్) వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీ కడలి నాగరాజు, శ్రీ అంబికా సురేష్, శ్రీమతి హన్సి, శ్రీ పవన్ కుమార్,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here