జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలోని పాత ఆర్అండ్బి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కార్యాలయం కొనసాగుతోంది. అయితే ఈ మధ్యకాలంలో ఆ కార్యాలయం తెరుచుకోవడం లేదని.. ఆ కార్యాలయానికి కరెంటు సదుపాయం లేదని.. మరి ఇన్ని రోజులు కరెంటు లేకుండా కార్యాలయం ఎలా నడిచిందని..రైతులు ప్రశ్నిస్తున్నారు. కరెంటు లేదు అనే కారణం చెబుతూ అధికారులు కార్యాలయం తీయడం మానేశారు. రైతులు తమ అవసరాల రీత్యా చెప్పులరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతూ వెళ్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల పనితీరు పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇక వ్యవసాయ అధికారులు ఎక్కడ ఉంటున్నట్లు..? అసలు డ్యూటీకి వస్తున్నారా.? లేదా..?రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి.. సేవలు అందించాల్సిన అధికారులే.. తమ బాధ్యతను విస్మరించారని..అయితే కనీస సౌకర్యాలు లేని కారణంగా ఆఫీసు తీయడం లేదని అధికారులు చెప్పడం గమనార్హమని..పని చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.రిపోర్టర్:జి.సుధాకర్