ప్రభుత్వ రంగ సంస్థలను లేకుండా చేస్తే ప్రజలకే నష్టం
తెరాస సర్కారుకు కేంద్రం పై ద్వంద వైఖరి
పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి స్వయంగా వచ్చి కుర్చీ వేసుకొని పరిష్కారం చేస్తా అన్న ముఖ్యమంత్రి కి కుర్చీ దొరకలేదా…
……………….
CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
………………..
భద్రాచలం… దేశాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టి. పూర్తిగా ప్రభుత్వ రంగాన్ని అమ్మకానికి పెట్టి ప్రజలకు నష్టం చేసే ప్రధానమంత్రి వ్యవహారం పై ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునేందుకు పోరాటం చేయాలని CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు ….మంగళవారం భద్రాచలం CPI కార్యాలయంలో కారం సమ్మయ్య అధ్యక్షత న నియోజకవర్గ సమావేశం జరిగింది ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెరాస సర్కారు కు కేంద్రం అంటే భయపడుతుందని పైపైకి మాట్లాడుతూ కేసీఆర్ కాలం గడుపుతున్నారని అన్నారు..రైతు చట్టాలపై ఎందుకు తెరాస సర్కారు బంద్ కు మద్దతు ఇవ్వలేదని అన్నారు.. తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ ద్వంద వైఖరిని గమనిస్తున్నారని భవిష్యత్తు లో ప్రజలు రాష్ట్రంలో .దేశంలో చిన్న. పెద్ద దొరలను తరిమేసే రోజులు దగ్గరలొనే ఉన్నాయని అన్నారు.ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు నిరంతర పోరాటం చేయాలని ఆయన అన్నారు.ఏజెన్సీ లో పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి కుర్చీ వేసుకొని కూర్చొని పోడు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిన కేసీఆర్ కు కుర్చీ దొరకలేదా అని ఎద్దేవా చేశారు..ఈ సమావేశంలో CPI జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా. CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్. అయోధ్య. రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు. నరాటి ప్రసాద్.CPI డివిజన్ నాయకులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు. అకోజు సునీల్. బల్లా సాయి కుమార్. నోముల రామిరెడ్డి.తిరుపతి రావు.బొల్లోజు వేణు. నానిపల్లి భద్రం. మట్టా నర్సింహారావు.శ్రీరాములు. మీసాల భాస్కర్ రావు. నర్సింహులు. విశ్వనాద్. బూరుగు లావణ్య. శ్యామల పద్మ తదితరులు పాల్గొన్నారు..
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్