జనగామ జిల్లా,దేవరుప్పుల మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొనసాగుతున్న కోవిడ్-19 వ్యాక్సిన్..ఈ వ్యాక్సిన్ తీసుకొనుటకు ముందుకొస్తున్న మహిళలు,పురుషులు,వృద్ధులు..గత మూడు రోజులలో కరోన విజృంభన ఎక్కువకావడంతో ప్రజలు వ్యాక్సిన్ తీసుకొనుటకై మొగ్గుచూపుతున్నారు.కొంతమంది వ్యాక్సిన్ తీసుకొనుటకు భయపడుతుండగా.. మరికొందరు ఆ..కరోన వస్తే చూద్దాంలే.. అంటున్నారు.ఏదిఏమైనా కరోనను అరికట్టేందుకు వ్యాక్సిన్ తో పాటు మాస్కులు ధరించడం..స్వీయనియంత్రణ పాటించడం..చేస్తే కొంతవరకు అరికట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.నేనొక్కడినే బాగుండాలి..!ఎవడుఏమైతే నాకేంటి..?అని కాకుండా మనకు తోచినంతవరకు ఓ ఇద్దరికి చెబుదాం..!ఆ ఇద్దరూ ఇంకో ఇద్దరికి..!అలా మొదలైతే..అందరూ బాగుంటారు..!రిపోర్టర్:జి.సుధాకర్.