Home Telangana డివైడర్ నిర్మాణానికి పంచాయతీ నిధులు రద్దు చేసి ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయాలి ; CPI...

డివైడర్ నిర్మాణానికి పంచాయతీ నిధులు రద్దు చేసి ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయాలి ; CPI డిమాండ్

0
0

పంచాయతీ సొమ్ముతో డివైడర్ నిర్మాణం చేయడం సరైన విధానం కాదు

పంచాయతీ నిధులు శివారు కాలనీల అభివృద్ధికి కేటాయించాలి

పంచాయతీ సొమ్ము తో జాతీయ రహదారిపై డివైడర్ నిర్మాణం చేయటం హాస్యాస్పదం…

భద్రాచలం… భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి బిడ్జ్ వరకు నూతన డివైడర్ నిర్మాణం పంచాయతీ నిధులు సుమారు 45 లక్షలు కేటాయించి నిర్మాణం చేయటం హాస్యాస్పదంగా ఉన్నదని CPI పట్టణ కార్యదర్శి అకోజు సునిల్ కుమార్ అన్నారు…గురువారం అంబేద్కర్ సెంటరులో పగలగొట్టిన డివైడర్ ల దగ్గర CPI ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా అకోజు సునిల్ కుమార్ మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో శివారు ప్రాంతాల్లో కనీస వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.చాలా కాలనిలో అంతర్గత రోడ్డు. డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు నరక యాతన అనుభవిస్తున్న నేపథ్యంలో శివారు కాలనీల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా జాతీయ రహదారిపై పంచాయతీ నిధులతో డివైడర్ నిర్మాణం చేయటం చూస్తుంటే ప్రజలు ఎలా ఉన్నా మనకు అవసరం లేదనే చందంగా అధికారులు. ప్రభుత్వం వ్యవహారం ఉందని అన్నారు..అభివృద్ధి కి కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం కాదని. కానీ నిధులు సక్రమంగా ప్రజల అభివృద్ధి కి ఉపయోగించే విధానం ఉండాలని అన్నారు.తక్షణమే ప్రభుత్వం డివైడర్ నిర్మాణానికి పంచాయతీ నిధులు రద్దు చేసి అట్టి నిధులు శివారు కాలనీల అభివృద్ధి కి కేటాయించాలని డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో CPI నాయకులు బల్లా సాయి కుమార్. విశ్వనాధ్. హిమాం ఖాసీం. మద్దెటి రాము.కిరణ్. తిరుపతి రావు.రాము.నర్సింహులు .నర్సింహారావు. తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here