మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ మరియు రామతీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం రామ జన్మభూమి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కొరకు తలపెట్టిన నిధి సమర్పణ కార్యక్రమాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన టిఆర్ఎస్ కొందరు ఎమ్మెల్యే లు మంత్రులను ఉద్దేశించి బీజేపీ నాయకులు రామతీర్థ ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం రాముడు అందరి వాడు అలాంటి రామునికి మన వంతు భక్తిగా కాదు నిరుపేద హిందువు కూడా మందిర నిర్మాణం లో భాగస్వామి కావాలని ట్రస్ట్ ఆశించింది అనంతరం ఈ విషయానికి ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో లేని విధంగా సుప్రీం కోర్ట్ ధర్మాసనం కూడా ఆమోదించింది అని తెలిపారు అనంతరం రాముని జన్మ స్థలం అయోధ్యలో కూడ మందిర నిర్మాణానికై పాటు పడుతున్న భారతీయులు అందరూ రాజకీయాలకు అతీతంగా ముందుకు వస్తున్న వారు కొందరైతే దేశం గురుంచి ధర్మం గురించి కనీస అవగాహన లేని వారు నాయకులుగా చలామణి అవుతున్నారు ఇలాంటి వారి అందరిని ప్రజలు గమనించాలని తెలిపారు రామ మందిర్ నిర్మాణం లో తమ వంతు భక్తి ని చాటుకోవాలని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఓ బి సి సెల్ కార్యవర్గ సభ్యుడు కరణం గణేష్ రవికుమార్ దళిత నాయకుడు కొండి స్వామి ఖండ సంయోజక్ గోవింద్ ఖండ ప్రచార ప్రముఖ్ రాజగోపాల్ బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్ ప్రధాన కార్యదర్శి నర్సింలు టౌన్ అధ్యక్షుడు సాయిరాజ్ నాయకులు రఘువీరా రావ్ బాలచందర్ హరిశంకర్ చంద్రమౌళి సాయిబాబ బీజేపీ వి హెచ్ పి నాయకులు పాల్గొన్నారు…మెదక్ జిల్లా చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ కుమార్
Home Telangana టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ,రామతీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన