Home Telangana జిల్లాలో రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు

జిల్లాలో రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు

0
0

జయశంకర్ భూపాలపల్లి  జిల్లాలో రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులను సంఘటితం చేసి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి మార్కెటింగ్ చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సంబంధిత శాఖల అధికారులతో కమిటీ వేసి కమిటీ నిర్ణయం మేరకు మహాదేవపూర్ లో ఒక సంఘం మరియు భూపాలపల్లి,చిట్యాల,టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలను కలిపి మరొక రైతు ఉత్పత్తి దారుల సంఘాన్ని ఏర్పాటు చేయుటకు కమిటీ నిర్ణయించిందని ఈ నిర్ణయం మేరకు వెంటనే జిల్లాలో 2 రైతు ఉత్పత్తి దారుల సంఘాలను స్థాపించి ఒక్కో సంఘంలో 300 మంది రైతులకు తగ్గకుండా సభ్యులను చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక జిల్లా ఒక పంట నినాదంతో జిల్లాలోని 2 సంఘాల ద్వారా మిర్చి పంట పండించేందుకు నిర్ణయిoచడం జరిగిందని ఈ సంఘాల ద్వారా రైతులు సంఘటితంగా ఒకే రకమైన పంటను పండించి మార్కెటింగ్ సౌకర్యాలను సృష్టించుకుని అధిక మొత్తంలో లాభాలను ఆర్జించేలా అధికారులు కృషి చేయాలని, నాబార్డు వారు రైతులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో వ్యవసాయంలో చురుగ్గా వ్యవహరించే రైతులను సంఘ సభ్యులుగా చేర్చి సంఘాలు త్వరగా అభివృద్ధి చెంది వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకునేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎల్డిఎం శ్రీనివాస్, నాబార్డ్ డిడిఎం చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్, జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పురుషోత్తం, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్,జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా. కుమారస్వామి, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు కుమారస్వామి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here