Home Telangana జాతీయ రహదారి గా గుర్తించండి : ఎంపీ పోతుగంటి రాములు

జాతీయ రహదారి గా గుర్తించండి : ఎంపీ పోతుగంటి రాములు

0
0

భూత్పుర్ నుండి అమ్రాబాద్ వరకు100 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మించండి.

– కేంద్ర జాతీయ రహదారుల కార్యదర్శి గిరిధర్ కు వినతిపత్రం సమర్పించిన ఎంపీ పోతుగంటి రాములు.

మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని భూత్పుర్ నుండి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ వరకు ఉన్న స్టేట్ హైవే ను జాతీయ రహదారి గా గుర్తించి కావాల్సిన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పరచాలని నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ రహదారుల కార్యదర్శి గిరిధర్ కు మంగళవారం ఎంపీ పోతుగంటి రాములు వినతి పత్రం అందజేశారు. NH167 నుండి NH 765 ,NH44 ల ల మీదుగా భూత్పుర్ నుండి నాగర్ కర్నూల్ -అచ్చంపేట- అమ్రాబాద్ (బిజినపల్లి – నాగర్ కర్నూల్ – తెలకపల్లి – అచ్చంపేట – మనన్నుర్) వరకు 100 కిలోమీటర్ల మేర స్టేట్ హైవే ను జాతీయ రహదారి గా గుర్తించాలని కోరారు . జాతీయ రహదారి గా అభివృద్ధి చేస్తే నాగర్ కర్నూల్ జిల్లా పాటు ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం తో వెనుకబడిన తన పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. తక్షణమే కావాల్సిన నిధులు మంజూరు చేసి సహకరించాలని ఎంపీ పోతుగంటి రాములు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here