Home Telangana చందాయిపేట రైతు వేదికలో రైతులకు ఆరుతడి పంటల పై అవగాహన సదస్సు

చందాయిపేట రైతు వేదికలో రైతులకు ఆరుతడి పంటల పై అవగాహన సదస్సు

0
0

మెదక్ జిల్లా చేగుంట మండలంలో పరిధిలోగల చందాయ్ పేట్ రైతు వేదిక భవనంలో శనివారం నాడు రైతు శిక్షణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ చేగుంట అధికారులు చందాయిపేట రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ పరశురాం నాయక్ మాట్లాడుతూ పంట మార్పిడి చేసుకోవాలని ఆరుతడి పంటల పై శిక్షణా కార్యక్రమాన్ని ర్వహించారు. రైతులకు ఫామ్ పాండ్స్ మరియు వాటి ఉపయోగాలు వివరిస్తూ రైతులు MGNREGS ద్వారా ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. అజోల్లా పెంపకం గురుంచి మాట్లాడుతూ.అజోల్లా జీవన ఎరువుగా మంచి ఫలితాలనిస్తుంది. దమ్ములో అజొల్లాను పచ్చిరొట్టగా ఉపయాగించుకోవచ్చుని తెలిపారు..ప్రస్తుత పరిస్థితుల్లో వరి పైరును ఆశించు చీడపీడల పై అవగాహన కల్పిస్తూ కాండం తొలుచు పురుగు నివారణ లార్వా దశలను నియంత్రించడానికి గ్రాన్యులార్ పురుగుమందులు మరింత ప్రభావవంతంగా ఉంటాయని తెలిపారు క్లోరాంట్రానిలిప్రోల్ 0.4% జిఆర్ @ 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4% జి @ 10 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3% జిఆర్ @ 20-25 కిలోలు హెక్టారుకు రెండుసార్లు వరి పొలంలో మొదట తెగులు ఆశించిన దశలో లేదా నాట్లు వేసిన 30-35 రోజుల తరువాత మరియు మొదటి వాడిన 15-20 రోజుల తర్వాత రెండవ సారి పిచికారి చేయాలని తెలిపారు..చందాయిపేట లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ శ్రీ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు అందరూ వ్యవసాయ అధికారులు సూచన మేరకు సాగులో మెళకువలు పాటింది అధిక దిగుబడులు సాధించాలని సూచించారు..ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జయశంకర్, సర్పంచ్ బుడ్డ స్వర్ణలత,ఉప సర్పంచ్ సంతోష్,AEO భువనేశ్వరి,TA యాదగిరి మరియు రైతులు కిష్టయ్య,నాగరాజు,యాదగిరి,అంజిరెడ్డి,ప్రతాపరెడ్డి,రాములు తదితరులు పాల్గొన్నారు..చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here