నేడు స్థానిక టిఎన్జీవోస్ ప్రెసిడెంట్ డెక్క నరసింహారావు, అసోసియేట్ ప్రెసిడెంట్ కటుకూరి నాగభూషణం గార్ల ఆధ్వర్యంలో బాబు బాబు జగ్జీవన్ రాం 114 వ జయంతిని ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ గార్లు మాట్లాడుతూ బాబు జగజ్జివన్ రావు జాతి వివక్షతను, అంటరానితనాన్ని రూపుమాపడంలో ప్రముఖ పాత్ర పోషించారని, అదేవిధంగా స్వతంత్ర సాధించడంలో కూడా ప్రముఖ పాత్ర వహించారని తెలియజేసినారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ గగ్గురి బాలకృష్ణ మాట్లాడుతూ బాబు జగజ్జివన్ రావు అభ్యుదయ వాది అని, రాజ్యాంగాన్ని రచించిన ప్రముఖులలో ఒకరిని, వారు దేశానికి ఎనలేని సేవ చేశారని, నేటి యువత వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పడిగ నరసింహారావు, గజ్జల్లి శ్రీనివాస్, అపర్ణ, నాగబత్తుల శ్రీనివాస్, లింగమూర్తి, గురునారాయణ, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్