Home Telangana ఘనంగా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0
0

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో 40వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం ఆదిలాబాద్ పార్లమెంట్ లోని కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి , పార్టీ జెండాను ఆవిష్కరించిన *పార్లమెంట్ అధ్యక్షుడు గుళ్లపల్లి ఆనంద్ గారు ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుళ్లపల్లి ఆనంద్ గారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ.బడుగు బలహీన వర్గాల సముద్దరణ లక్ష్యంతో 1982 మార్చి 29 న 40 ఏళ్ళ కిందట నందమూరి తారకరామారావు గారు చీకట్లో వెలిగించిన దీపం తెలుగుదేశం.అస్తవ్యస్త.సామాజిక.అద్వాన్న పరిస్తుతుల మధ్య పాపపంకిల రాజకీయ పద్మ వ్యూహాల మధ్య.ఆదరణ లేని అన్నదాతల అవస్థల మధ్య.శ్రమజీవుల రెక్కల కష్టాలమధ్య.తాగేoదుకునీరు లేని.ఆడిగేoదుకు నోరు లేని అభాగ్యుల కడగండ్ల మధ్య ప్రగతి కోరి.ప్రజాసంక్షేమం కోరి తెలుగుదేశం ఆవిర్భవించింది. అన్ని వర్గాల ఆధారాభి మానాలతో .కార్యకర్తల అండదండలతో రాష్ట్రప్రయోజనాల కోసం నిరంతరం పాటు పడి తెలుగు రాష్ట్రాలను 22 సంవత్సరాలు పరిపాలించింది. తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన తరువాతనే ఆర్ధిక. సామాజిక విప్లవం మొదలయింది. విద్యావంతులకు. యువతరానికి. చెందిన సామాన్యులకు.మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలను సామాన్యు ల చెంతకు చేర్చిన ఘనత నందమూరి తారకరామారావు గారి దే. తన పరిపాలన అట్టడుగు ప్రజల అభివృద్ధి కి పునాధి కావాలని.శ్రమజీవుల కష్టాన్ని గుర్తించి వారి అభివృద్ధి కై తపించి బూజు పట్టిన బూర్జువా వ్యవస్థలను రూపు మాఫీ విప్లవాత్మక విధానాలను పరిపాలనలో పాదుగొల్పి సమ సమాజంకోసం ప్రతినిముషం శ్రమించిన పరిపాలనా దక్షుడు ఎన్ఠీఆర్. సమాజమే దేవాలయం.ప్రజలే దేవుళ్ళు అని నినదించిన గొప్ప దేశ భక్తుడు ఎన్ఠీఆర్. ఆకలి గొన్న ఆర్తులకు అన్న పూర్ణుడై రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల కడుపు నింపిన కరుణా మయుడు ఎన్ఠీఆర్.పదవుల కోసమో.అధికారం కోసమో పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం. తెలుగు ప్రజలకోసం పుట్టిన పార్టీ .అధికారంలో ఉన్నా .లేకున్నా ప్రజల పక్షాన అండగా నిలుస్తున్న పార్టీ .ఆవిర్భావం నుండి బడుగులకు నీడనిస్తున్న పార్టీ.పెత్తం దారీ పాలనకు ముగింపు పలికి రాజకీయ ప్రజాస్వామ్యానికి శ్రీకారం చుట్టిన ఘనత తెలుగు దేశానిదే. సిద్దాంత పరంగా తెలుగుదేశం పార్టీకి ఎన్ఠీఆర్ వేసిన పునాదులు బలంగా ఉన్నాయి. ఓటమి కూడా పార్టీకి కొత్తఏమి కాదు.పార్టీ ఆవిర్భావం నుండి అనేకమంది నాయకులు పార్టీని వీడినా ఆదరని బెదరని పార్టీ. తెలుగుదేశం పార్టీ కి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.రాష్ట్ర ప్రతిష్టను జాతీయంగానే కాక అంతర్జాతీయంగా ఇనుమడింప జేసిన పార్టీ తెలుగుదేశం. సమర్ధవంతమైన .ఆదర్సవంత మైనపాలన అందించి రాష్ట్రాభివృద్ధికి అంకిత భావంతో అహర్నిశలు పాటుపడ్డ పార్టీ . గుళ్లపల్లి ఆనంద్ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు , పార్లమెంట్ అధికార ప్రతినిధి మీర్ సాధిక్ అలీ, కార్యనిర్వహ కార్యదర్శి పి సురేష్ కుమార్, రాష్ట్ర TNTUC ఉపాధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్, శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు, సంజీవ్ కాగజ్ నగర్ మండల నాయకులు మాకబుల్, సంతోష్ మరియు నం దమూరి ,రామారావు అభిమానులు పాల్గొన్నారు.

ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here