Home Telangana గిరిజన హక్కుల సాధనకు పోరాటమే మార్గం TGS రాష్ట్ర కార్యదర్శి అంజయ్య నాయక్

గిరిజన హక్కుల సాధనకు పోరాటమే మార్గం TGS రాష్ట్ర కార్యదర్శి అంజయ్య నాయక్

0
0

పోడు భూములకు పట్టాలివ్వలేని ప్రభుత్వం పై సమిష్టి పోరాటం చేయాలి

*తెలంగాణ గిరిజన సమాఖ్య TGS రాష్ట్ర కార్యదర్శి
అంజయ్య నాయక్
*
భద్రాచలం… గిరిజన హక్కుల సాధన కొరకు పోరాటమే మార్గమని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వలేని తెలంగాణ సర్కార్ పై గిరిజన ప్రజలు గిరిజన రైతాంగం సమిష్టి పోరాటం చేసి భూములకు పట్టాలు సాధించాలని తెలంగాణ గిరిజన సమాఖ్య (టి జి ఎస్) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి అంజయ్య నాయక్ రామ్మూర్తి అన్నారు.భద్రాచలం అంబేద్కర్ సెంటర్ లో సిపిఐ కార్యాలయంలో తెలంగాణ గిరిజన సమాఖ్య (టి జి ఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ మహాసభ భూక్య శ్రీను. పాలంచ రామారావు భూక్య వెంకట్ .పాయం శ్రీను .అధ్యక్షతన జరిగింది..ఈ కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ గిరిజన సమాఖ్య (టీ జి ఎస్ )రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామవత్ అంజయ్య నాయక్ .అజ్మిరా రామ్మూర్తి లు హాజరై ప్రసంగించారు
గిరిజన ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏజెన్సీలో ఇంకా అనేక గ్రామాలకు రోడ్లు కరెంటు సరఫరా లేక గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఐ డి డి ఎ ప్రజలకు దిష్టిబొమ్మల దర్శనమిస్తున్నాయి అని ఐటీడిఏ లో గిరిజన అభివృద్ధికి నిధులు లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా గిరిజన ప్రజల సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం హామీల ఆర్భాటం తప్ప పరిష్కారం చూపే పరిస్థితి లేదని ఈ సందర్భంగా ఆరోపించారు ఏది ఏమైనప్పటికీ గిరిజన ప్రజల పక్షాన పోరాడే ది ఎర్ర జెండా అని అన్నారు..ఈ నిర్మాణ మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి ప్రసాద్ బొల్లోజు అయోధ్య.తమ్మళ్ల వెంకటేశ్వరరావు .గిరిజన సమాఖ్య నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు రామ్మూర్తి . లక్ష్మయ్య .కల్లూరి శ్రీరాములు. కాకామహేష్ .పాలెం సత్యనారాయణ. బడిసా సతీష్ .గుగులోత్ రామచందర్.భూక్య దాశ్రు తదితరులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here