Home Telangana గాయపడ్డ గిరిజనులను పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

గాయపడ్డ గిరిజనులను పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

0
0

దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవు ;
ఎమ్మెల్యే గువ్వల, కలెక్టర్ శర్మన్

అచ్చంపేట(టౌన్): అమ్రాబాద్ మండలపరిధిలోని మన్ననూర్ గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు హోళీ పండుగ వస్తున్న సందర్భంగా ఇప్పపువ్వుల కోసం నల్లమల అడవుల్లోకి వెళ్ళిన పలువురు గిరిజనుల ఫారెస్ట్ అధికారులు దాడి చేయగా గాయాలపాలై అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు పరామర్శించారు.చెంచుల, ఆదివాసుల, గిరిజనుల జీవనోపాధి కోసం అడవిలోకి వెళ్ళి ఇప్పపువ్వుల తీసుకోవడం కోసం వెళ్ళిన వారిని ఈరకంగా కొట్టడం చాలా బాధాకరమని ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని వారు ఎమ్మెల్యే గువ్వల విమర్శించారు.పొట్టకూటి కోసం వెళ్ళిన వారిని దారుణంగా చితకబాధడం నిజంగా సిగ్గుచేటు అని దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని వారిపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తప్పవని వారు విమర్శించారు.చట్టాలు ఉన్నవి కొట్టడం కోసం కాదని కాపాడుకోవడం కోసమేనని కానీ ఇలా దాడి చేయడం నిజంగా జీర్ణించుకోలేని విషయమని వారిపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారు తెలియజేశారు.ఈసందర్భంగా దాడిలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే గువ్వల గారు మరియు కలెక్టర్ శర్మన్ గారు కోరారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు, తదితరులు ఉన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here