Home Telangana క్రీడలు మానసిక ఉత్తేజం తో పాటు సమత భావనలు పెంపొందిస్తాయి” డా.పాల్వాయి

క్రీడలు మానసిక ఉత్తేజం తో పాటు సమత భావనలు పెంపొందిస్తాయి” డా.పాల్వాయి

0
0

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా “క్రీడలు మానసిక ఉత్తేజం తో పాటు సమత భావనలు పెంపొందిస్తాయి” డా.పాల్వాయిసిర్పూర్ మండలం గంగాయి గూడ (న్యూ కాలనీ) లో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ బహుమతుల ప్రధానం ప్రజాబంధు స్వర్గీయ శ్రీ పాల్వాయి పురుషోత్తం రావు గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు (25-03-2021) గంగాయి గూడ (న్యూ కాలనీ) గ్రా,, సిర్పూర్ మండలం లో నిర్వహించడం జరిగింది. ఉత్కంఠ మధ్య జరిగిన దుబ్బగూడ – సిర్పూర్ టీమ్ ఫైనల్ మ్యాచ్ లో సిర్పూర్ టీమ్ విజేత గా, దుబ్బగూడ టీం రన్నరప్ గా నిలవడం జరిగింది. విజేతలకు బహుమతి రూ. 20000/-, రన్నరప్ కు రూ. 11000/- సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు డా. పాల్వాయి హరీష్ బాబు గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయటం జరిగింది. బీజేపీ నాయకులు డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ గ్రామాలలో క్రీడా స్పూర్తిని పెంపొందించుటకు గత మాసం నుండి ప్రజాబంధు స్వర్గీయ పాల్వాయి పురుషోత్తం రావు గారి జ్ఞాపకార్ధం స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమం లో సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ వీరభద్ర చారి, మండల అధ్యక్షులు దామరపల్లి వెంకటేశ్, సర్పంచ్ ధోతుల శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి ఎల్ములే శంకర్, దుర్గం తులసిరామ్, జాడి దిగంబర్, ఒడ్డెటీ నాని, కరుణాకర్, రియాసత్, ఫాహద్ అహ్మద్, దంద్రే దివాకర్, నూలిగొండ రాజశేఖర్, జైద్, సాయి భనర్కార్, జావిద్ అహ్మద్, అమీనుద్దిన్, అమేర్, దుర్గం విజయ్, రవి, సంతోష్, తిరుపతి మరియు పాల్వాయి అభిమానులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here