జాబు నోటిఫికేషన్ ఇవ్వడంలేదని కేయూ విద్యార్థి సునీల్ పురుగుల మందు తాగి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన సునీల్ కు ప్రగడ సానుభూతి తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి సుమేష్ యాదవ్. దయచేసి నిరుద్యోగులు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రన్ని ఏవిధంగ ఉద్యమించి సాధించమో అదే విధంగా ఉద్యమ బాటలోనే నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పై కొట్లాడి సాధించాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగిందని స్వరాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విభజన వల్ల కేసీఆర్ ఇంట్లో అందరికి జాబులు వచ్చాయని పేదవారికి ఆకలి కేకలు మిగిలాయని ఆయన దుయ్యబట్టారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని జాబ్ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఎవ్వరు ఇలాంటి చర్యలకు పాడోద్దంటు సుమేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Home Telangana కేయూ విద్యార్థి సునీల్ కు ప్రగడ సానుభూతి తెలిపిన ఖమ్మం జిల్లా కార్యదర్శి సుమేష్ యాదవ్