Home Telangana కరోనా వ్యాపించకుండా చర్యలు చేపట్టాలి..

కరోనా వ్యాపించకుండా చర్యలు చేపట్టాలి..

0
0

జయశంకర్ భూపాలపల్లి కరోనా వైరస్ వ్యాపించకుండా గ్రామాలలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రివర్యులు గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సందీప్ సుల్తానియా,రఘునందన్ రావు లతో కలిసి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందుచూపుతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలు దాదాపు పూర్తి కావచ్చినాయని ఈ కార్యక్రమం ద్వారా నిర్మించిన వైకుంఠ దామాలు,షేగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలను వాడుకలోకి తీసుకురావాలని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు సక్రమంగా జరుగుతున్నాయని పంచాయతీ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధి పనులతో పాటు ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నoదున పల్లెప్రగతి కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన విధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను అన్ని గ్రామాల్లో సమర్థవంతంగా నిర్వహించి వ్యాధులకు గ్రామాలను దూరంగా ఉంచాలని, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు తరచు గ్రామాలను సందర్శించి గ్రామాల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని అదేవిధంగా కరోనా వైరస్ రాకుండా ఇతర శాఖల అధికారులను సిబ్బందిని సమన్వయం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేసి కరోనా వైరస్ ను కట్టుదిట్టం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్, డిఆర్డిఓ పురుషోత్తం, డిపిఓ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here