Home Telangana కరోనా నివారణకు పకడ్భంది చర్యలు: రాష్ట్ర ముఖ్య కార్యదర్శీ సోమేష్ కుమార్

కరోనా నివారణకు పకడ్భంది చర్యలు: రాష్ట్ర ముఖ్య కార్యదర్శీ సోమేష్ కుమార్

0
0

జయశంకర్ భూపాలపల్లి  కరోనా వ్యాధి నియంత్రణకు పకఢ్భందిగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల నిర్వహణ, కరోనావ్యాప్తి నివారణ చర్యలపై కలెక్టర్లతో మంగళవారం హైదరాబాద్ నుండి సీఎస్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కరోనా నియంత్రణ చర్యలను పకడ్భందిగా చేపట్టాలని ఆదేశించారు. కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం 100 పరీక్షలను, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో 150 పరీక్షలను, సివిల్ ఆసుపత్రిలో 300 టెస్టులను ప్రతి రోజు నిర్వహించాలని, వాటి ఫలితాలను కోవిడ్ యాప్ లో ఎప్పటికప్పుడు నమెదు చేయాలని అన్నారు. కరోనా పరీక్షల ఫలితాల ఆధారంగా కోవిడ్ వ్యాప్తిస్తున్న వారిని గుర్తించి వారిని హోం క్వారంటైన్ చేయాలని, ఇళ్లలో వసతి లేనివారి కొరకు ప్రభుత్వ క్వారంటైన్ హోంలకు తరలించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. కరొనా అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి సదరు ప్రాంతాలో ప్రత్యేక పారిశద్ద్య చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ద్య చర్యలు పకడ్భందిగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు పైబడిన ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని, జిల్లాలో కరొనా వ్యాక్సినేషన్ లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పి.హెచ్.సి పరిధిలో 125 మందికి, సి.హెచ్.సి పరిధిలో 250 మందికి, సివిల్ ఆసుపత్రి పరిధిలో 300 మందికి ప్రతి రోజు కరోనా వ్యాక్సినేషన్ అందించాలని ఆదేశించారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సామూహిక కార్యక్రమాలు, సభలకు అనుమతి ఇవ్వరాదని, ప్రజలు తప్పనిసరిగ్గా మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కరోనా వైద్యానికి చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కేసులు అధికంగా వస్తే ఆసుపత్రి స్థాయిలో చికిత్స అందించేందుకు వీలుగా ఆసుపత్రులను సిద్దం చేయాలని, కొవిడ్ కోసం ప్రత్యేకంగా బెడ్లు, వార్డులను సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాలో వ్యాదినిర్దారణ పరీక్షలను పెంచాలని, ట్రెసింగ్ పకడ్భందిగా నిర్వహించాలని ఆదేశించారు.సమావేశంలో పాల్గోన్న జిల్లా కృష్ణ ఆదిత్య గారు మాట్లాడుతూ జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేస్తున్నామని, వైరస్ వ్యాప్తిని బట్టి అదనంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా పరీక్షలు సైతం అధికంగా చేసేలా చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి స్థాయిలో చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్దం చేసుకుంటున్నామని, జిల్లా లో కోవిడ్ కేర్ సెంటర్ల ను గతం లో ఏర్పటు చేసి సెంటర్స్ పునరుద్దరణ ఏర్పాటు చేస్తున్నామని పేర్కోన్నారు. వీడియో కాన్ఫరెన్ అనతరం రెండు జిల్లా ల వైద్య అధికారులతో కోవిడ్ -19 ప్రభావం,నివారణ చర్యలగురించి మాట్లాడారు 45 సంవత్సరాల పై బడిన వారికి కూడా వ్యాక్సిన్ వేయుటకు ప్రభుత్వ నిభందనల మేరకు వ్యాక్సిన్ వేయుటకు చర్యలు తీసుకోవలసినదిగా జిల్లా వైద్య అధికారులను ఆదేశించారు , నరెగా వర్క్స్ కి కోవిడ్ వ్యాక్సిన్ వేయిoచాలని, మరియు అనుకూలమైన ప్రభుత్వ పాటశాలల్లో క్యాంప్ ఏర్పాటు చేసే విదంగా ,ప్రజలలో కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయిoచు కొనుటకు అవగాహనా అవగాహనా కలిగే లా అంగన్ వాడి కార్యకర్తలు ,ఆశ వర్క్స్ తో ఇంటింటికి అవగాహనా కల్పించే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమానికి ములుగు ,మరియు భూపాలపల్లి జిల్లా వైద్యారొగ్య శాఖ అధికారి , సంబంధిత అధికారులు తదితరులు ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here