Home Telangana కరోనా కట్టడికి కలిసికట్టుగా కృషి చేయాలి.

కరోనా కట్టడికి కలిసికట్టుగా కృషి చేయాలి.

0
0

జయశంకర్ భూపాలపల్లి కరోనా కేసులు తీవ్రమవుతున్నoదున జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండి కోవిడ్ నిబంధనలను తూచా తప్పక పాటించాలన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించి కోవిడ్ వ్యాక్సినేషన్, వరి ధాన్యం కొనుగోలు, పల్లె ప్రగతి పనుల పురోగతిపై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు కరోనా కేసులు అధికమవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో మన జిల్లా సరిహద్దు కలిగి ఉండటం మరియు ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నందున ఆ ప్రభావం మన జిల్లాపై పడే అవకాశం అధికంగా ఉన్నందున జిల్లాలోని ప్రజలు కరోన నిబంధనలను తప్పక పాటిస్తూ కరోనా వ్యాధి సోకకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం 45 సంవత్సరాలు దాటిన పౌరులందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఇస్తున్నoదున 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్యూనేషన్ పెరిగి కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఎలాంటి అపోహలకు గురి కాకుండా కచ్చితంగా 45 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కరోనా కేసులు అధికంగా గల టేకుమట్ల మండలంలోని గర్మిల్లపల్లి గ్రామము మరియు మహదేవపూర్ మండలంలోని ఎడపల్లి గ్రామాలను కంటైంన్మెంట్ చేసి వైద్యం అందిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు 800 నుండి 1000 కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఒక క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలకు కలిపి ములుగు ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.రైతులు పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇబ్బంది పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో వారిధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. గత సంవత్సరం 200 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయగా ఈసారి మరో 10 శాతం అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, వ్యవసాయ అధికారులు ముందస్తుగా జారీ చేసిన టోకెన్ల ప్రకారం ప్రభుత్వ నిర్ణయo మేరకు తాలు,తేమశాతం లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్, టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్లు సిద్ధం చేస్తున్నామని, మన జిల్లాలో కొంచెం లేటుగా వరి కోతకు వస్తున్నందున ఈ నెల మూడవ వారంలో కొనుగోలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. అలాగే గతంలో మాదిరిగా పెద్దపల్లి,సూర్యాపేట తదితర జిల్లాల మిల్లులకు కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని రవాణా చేసేందుకు పౌర సరఫరాల కమిషనర్ కు లేఖ రాయడం జరిగిందని, రైతులు తప్పకుండా తాలు,తేమ లేకుండా వ్యవసాయ అధికారులు జారీ చేసిన టోకెన్ల ప్రకారం మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావాలని కోరారు.జిల్లాలో పల్లె ప్రగతి పనులు పురోగతిలో ఉన్నాయని 240 షేగ్రిగేషన్ షెడ్లకు గాను అన్ని పూర్తయ్యాయని, పల్లె ప్రకృతి వనాలు కూడా ఎలాంటి జాప్యం లేకుండా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయని, భూమి సమస్య ఉన్న గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో వైకుంఠదామాలు కూడా పూర్తికావస్తున్నాయన్నారు. నిధులు ఉన్న గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతివనాలు మరియు వైకుంఠదామంలలో నీటి సౌకర్యానికి బోర్లను ఏర్పాటు చేస్తున్నామని,పంట కల్లాల నిర్మాణానికి అడ్వాన్స్ గా నిధులను ఇస్తున్నామని తెలిపారు .
ఈ ప్రెస్ మీట్ లో డిపిఆర్ఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here