Home Telangana కడంలో భారత్ బంద్ విజయ వంతం – ముందస్తు అరెస్టు

కడంలో భారత్ బంద్ విజయ వంతం – ముందస్తు అరెస్టు

0
0

అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటి పిలుపులో భాగంగా కడంలో బంద్ విజయ వంతo అయింది. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా రైతులు 4 నెలలుగా ఢిల్లీలో ఆందోళన లు చేస్తే మోడీ ప్రభుత్వం రైతుల డిమాండ్లు ఆమోదించాక పోవడం సిగ్గు చేటు. ఈ దేశంలో రైతాంగ సమస్యలే కాదు.ప్రజాస్వామ్య వ్యవస్థ ను నిలబెట్టేందుకు, శ్రామిక ప్రజల జీవనోపాధి ని,ఆహార వ్యవస్థను బడా కార్పొరేట్ల నుంచి రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ సంస్థల ను ప్రయివేట్ కరణను వ్యతిరేకంగా పోరాటం చేయాలి. పెరుగుతున్న పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులను నడ్డి విరుస్తున్నారు. పేద ప్రజలకోసం ప్రభుత్వం పనిచేస్తుందని,చంకలు గుడ్డుకుంటూ మరోవైపు బడా పెట్టుబడిదారులైన అంబానీ,ఆదాయానికి కొమ్ముకాసుంది. ప్రభుత్వ వైఫల్యం వల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి.అదుపు చేయడంలో ప్రభుత్వాలు పూర్తి గా విఫలమైంది. అన్ని వ్యవస్తల ను ప్రయివేట్ చేస్తుంటే ప్రభుత్వాలను ప్రయివేటు చేస్తే బాగుంటుంది. మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా రైతుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.ముందస్తు పోలీసుల తో అక్రమ అరెస్టు లు చేస్తే భారత్ బందు ఆగుతుందా అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. ఈ బందుకు సహకరించిన అన్నివర్గాల ప్రజకు విజ్ఞప్తి.అరెస్టయిన PDSU జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్, తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు దుర్గం లింగన్న తదితరులు ఉన్నారు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here