Home Telangana ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం : ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం : ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

0
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కొత్తగూడెం 2వ పట్టణ పోలీసు స్టేషన్లో 50 సీసీ కెమెరాల కంట్రోల్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ గారు కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 50 సిసి కెమెరాల కంట్రోల్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏఎస్పీ(ఇంచార్జి) రోహిత్ రాజు ఐపీఎస్,సిఐ సత్యనారాయణ, ఎస్సై రాజేందర్, మహిళా పిఎస్సై విజయ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రణ చేయడం మరియు నేరస్తులను కనుగొనడం పోలీసులకు సులభతరం అవుతుందని అన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని తెలిపారు.జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేర రహిత జిల్లాగా మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యమని అన్నారు. ఇందులో భాగంగా జిల్లా ప్రజలందరూ “నేనుసైతం” లో భాగంగా తమ తమ నివాస మరియు వ్యాపార ప్రదేశాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాలను అదుపు చేయడంలో పోలీసువారికి సహకరించాలని కోరారు. అనంతరం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవ ఎస్పీ గారు 25 కెమెరాలను కేటాయించగా,మరో 25 కెమెరాలను కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మొత్తం 50 కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు.కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని SCB నగర్,రామవరం సెంటర్,మార్కెట్ ఏరియా,విమెన్ హాస్టల్,14 నం. బస్తి,రుద్రంపూర్,గౌతమ్ పూర్,పెనగడప,ధన్ బాద్,రామపురం ఏరియాలు అన్నీ కూడా ఈ 50 సీసీ కెమెరాల ద్వారా నిత్యం నిఘాలో ఉంటాయని తెలియజేసారు.మిగిలిన అన్ని ప్రదేశాల్లో కూడా త్వరలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here