తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌ,, శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో గ్రామ కమిటీ బూత్ కమిటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరవెండి గ్రామ అధ్యక్షుడు చేకూరి ప్రసాద్, కార్యదర్శిగా అజ్మీర మోహన్ రావు, ఇద్దరు బూత్ కన్వీనర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొర్సా లక్ష్మీ గారు,ఇరవెండి మాజీ ఎంపీటీసీ సభ్యులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, అశ్వాపురం టిఆర్ఎస్ నాయకులు ఇన్చార్జిలుగా పాల్గొన్నారు. జిల్లా రైతు బంధు సమితి సభ్యులు తాళ్లూరి రాధాకృష్ణ,
ఉప సర్పంచ్ తాటికొండ రామచంద్ర రావు, మాడపాటి ప్రకాష్, తాళ్లూరి రమేష్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరియు ఇరవెండి గ్రామం TRS పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్