Home Telangana అధిక చార్జీలు వసూల్ చేస్తే చర్యలు తప్పవు.. సంయుక్త కలెక్టర్ స్వర్ణలత

అధిక చార్జీలు వసూల్ చేస్తే చర్యలు తప్పవు.. సంయుక్త కలెక్టర్ స్వర్ణలత

0
0

జయశంకర్ భూపాలపల్లి కస్టమర్ల నుండి అధిక చార్జీలను వసూలు చేసే మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జెసి మీసేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్న ఆన్లైన్ సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని మీ సేవ కేంద్రాలలో ప్రజల నుండి నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్ల నుండి అధిక రుసుములను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటినుండి కచ్చితంగా ప్రభుత్వ నిర్ణయించిన మేరకు మాత్రమే ఫీజులను తీసుకోవాలని, జాప్యం లేకుండా మరియు అచ్చు తప్పులు లేకుండా నిర్దేశిత రుసుముతో ప్రజలు త్వరితగతిన అవుసరమైన సర్టిఫికెట్లు పొందేలా పనిచేయాలని, అధికారుసుములు వసూలు చేస్తున్నట్టు ప్రజాలనుండి ఫిర్యాదులు వస్తే ఆయా మీసేవ కేంద్రాల నిర్వాహకులను తొలగిస్తామన్నారు. అన్ని మీసేవ కేంద్రాలు అన్ని పనిదినాల్లో కచ్చితంగా ఓపెన్ చేయాలని అన్నారు.అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న 4 మీ సేవ కేంద్రాలను అర్హత ఉన్న ఇతరులకు కేటాయించడంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మీద మీ సేవ కేంద్రాల నిర్వహణపై నివేదిక అందించాలని మీసేవ అ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటిండెంట్ గౌస్, ఈడిఎం శ్రీకాంత్, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here