పై అదికారుల ఆదేశాలపై ఈ రోజు Dt.01.04.2021 ఉదయం 6 గంటల సమయంలో SI రవికుమార్ గారు తన సిబ్బంది మరియు 141 G కంపెనీ crpf ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు crpf సిబ్బంది తో కలిసి సీతానగరం గ్రామ శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా అదే సమయంలో భద్రాచలం నుండి చర్ల వైపు వెళుతూ ఒక కార్ కనిపించగా పోలీస్ వారు అట్టి కార్ ను ఆపడానికి ప్రయత్నించగా కార్ నడుపు వ్యక్తి కార్ ను అక్కడే రోడ్ మీద ఆపి పారిపోతుండగా పోలీస్ సిబ్బంది అట్టి వ్యక్తిని వెంబడించి పట్టుకొని విచారించగా అతను ఆదిలాబాద్ జిల్లా క్రాంతి నగర్ కు చెందిన షేక్ ఇర్ఫాన్ ,29 yrs ,ముస్లిం గా చెప్పి ఇతను ఆదిలాబాద్ ,కర్షిద్ నగర్ కు చెందిన షేక్ షారూక్ వద్ద కార్ డ్రైవర్ గా పని చేస్తానని ,తన యజమాని షారూక్ ఆంద్రా ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లోకి వెళ్లి తక్కువ ధరకు గంజాయి ని కొనుగోలు చేసి అట్టి గంజాయిని ఇర్ఫాన్ కు ఇవ్వగా ఇర్ఫాన్ కార్ ద్వారా ఆ గంజాయిని అదిలాబాద్ కి తరలిస్తాడని చెప్పినాడు. కార్ లో గల గంజాయిని పరిశీలించగా 89 గంజాయి ప్యాకెట్లు ఉన్నవి వాటి బరువు 178 కేజీ లుగా ఉన్నది ఒక్కక్కకేజీ విలువ 15 వేలు రూపాయలుగా మొత్తం గంజాయి విలువ 26,70,000 రూపాయలు గా ఉంటుందని అంచనా వెంటనే అట్టి వ్యక్తిని 178 కేజీల గంజాయి, కార్ ని స్వాధీనపరుచుకొని అట్టి వ్యక్తులను అదుపులోకి తీసుకొని SI రవికుమార్ గారు స్టేషన్ కు రాగా వచ్చి రిపోర్టు CI వెంకటేశ్వర్లు గారు ఇర్ఫాన్ మరియు షారూక్ ల మీద కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్