Home Special Stories మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతిపత్రం అందజేసిన తెరాస పార్టీ నాయకులు

మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతిపత్రం అందజేసిన తెరాస పార్టీ నాయకులు

0
0

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారిని కలిసి వినతిపత్రం అందజేసిన మంథని నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పుట్ట మధూకర్ గారు,భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్ గారు
జయశంకర్ భూపాలపల్లి: హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారిని కలిసి ఏటూరునాగారం లో ఐ.టి.డి.ఎ లో తాత్కాలికముగా డి.టి.డి.ఓ కార్యాలయన్ని నిర్వహిస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు గిరిజన మండలాలు మహాదేవపూర్,పలిమేల, మహాముత్తారం,మల్హర్ రావు, కాటారం మరియు జిల్లా పరిధిలోని ఇతర గిరిజన మండలాలు అధిక జనాభా కలిగి ఉన్నాయి. ప్రభుత్వ పరంగా కార్యాలయ నిర్వహణ ,సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుటకు అధికారులు దాదాపు 100 కిలోమీటర్ల దూరం భారమై చుట్టు పక్కల గిరిజనులకు ప్రయాణానికి చాలా కష్టతరంగా ఉన్నది. ప్రజలకు ఏటూరునాగారం వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాలు లేక నానా ఇబ్బందులకు గురవుచున్నారు. కావున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రమున కు డి.టి.డి.ఓ తరలించాలని వినతిపత్రం అందజేసిన మంథని నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పుట్ట మధూకర్ గారు, భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణిరాకేష్ గారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు మాజీ జడ్పీటీసీ శీలం లక్ష్మయ్య,మాజీ ఎంపీపీ కిషన్ నాయక్,గుంటి మల్లయ్య,బిస్కుల లక్ష్మయ్య పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here