Home Special Stories డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డులు.. రేపే ప్రారంభం

డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డులు.. రేపే ప్రారంభం

0
0

దిల్లీ: ఓటరు ఐడీలను ఇకపై మొబైల్‌/ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్‌ వెర్షన్‌ ఓటరు గుర్తింపు కార్డులు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా సోమవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వీటిని ఆవిష్కరించనున్నారు. ఈ డిజిటల్‌ ఓటరు గుర్తింపు కార్డును డిజిలాకర్‌లో పొందుపరచుకోవచ్చు. అలాగే పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ప్రింట్‌ చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు తెలిపాయి.రేపటి కార్యక్రమంలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న ఐదుగురికి డిజిటల్‌ కార్డులను మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అందజేస్తారని ఈసీ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపింది. ఓటరు ఐడీ కార్డును సత్వరమే ప్రజలకు అందించే విధంగా ఈ గుర్తింపు కార్డును తీసుకొస్తున్నారు. ఇకపై మీ-సేవ కేంద్రాలకు వెళ్లి ఓటరు కార్డు తీసుకునే అవసరం ఉండదు. ఇప్పటికే ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి డిజిటల్‌ మోడల్‌లో అందుబాటులో ఉండగా.. ఆ జాబితాలో ఓటరు గుర్తింపు కూడా చేరుతుండడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here