Home Crime మహిళా ప్రాంగణ భవన నిర్మాణానికి నిధులు మంజూరు ; మంత్రి హరీశ్ రావు

మహిళా ప్రాంగణ భవన నిర్మాణానికి నిధులు మంజూరు ; మంత్రి హరీశ్ రావు

0
0

– మహిళా ప్రాంగణ భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు…

– మహిళలకు శిక్షణ , స్వయం ఉపాధి అవకాశాలు…

– మంత్రి హరీష్ రావు గారు

మహిళలకు స్వయం ఉపాధి , శిక్షణ ఇచ్చేందుకు సిద్దిపేట లో మహిళ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు , ప్రాంగణ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు అయినట్లు మంత్రి హరీశ్ రావు గారు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రీసోర్స్ సెంటర్లను తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోందని , అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.. ఈ కేంద్రాలను దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాలు (మహిళా శిక్షణా కేంద్రాలు) లుగా ఆమె లో ఉన్న గొప్పతనం , ధైర్యాన్ని మహిళలకు అందించెందుకు మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ఉపయోగపడుతుందన్నారు ఇందులో శిక్షణ తో పాటు , ఉపాధి మార్గాలు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నమని చెప్పారు.. ఇది గ్రామీణ మరియు పట్టణ, నిరాశ్రయులైన, వితంతువు మరియు కౌమారదశలో ఉన్న విద్యావంతులైన నిరుద్యోగ మహిళలకు వారి ఆర్థిక సాధికారత కోసం శిక్షణ ఇస్తుంది. తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా ఐసిడిఎస్ కార్యకర్తలు, కౌమారదశలో ఉన్న బాలికలు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు మరియు సహాయకులకు కూడా శిక్షణ ఇస్తుంది. ఇట్టి మహిళా ప్రాంగణంలో ఎగ్జిబిషన్లు, వాణిజ్య ఉత్సవాలు, కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలు, డిజైన్ మరియు ప్రదర్శన కేంద్రాలు మొదలైనవి మార్కెటింగ్ అవకాశాలను సులభతరం చేయడానికి ఏర్పాట్లు చేయబడును. TSWDC వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను కూడా నిర్వహిస్తుంది. త్వరలోనే ప్రాంగణం పనులు మొదలు అవుతాయని అందుబాటులోకి తెచ్చి మహిళలకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పారు…. .తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here