Home AP 26న జరిగే భారత్ బంద్ కు యుటిఎఫ్ సంపూర్ణ మద్దతు

26న జరిగే భారత్ బంద్ కు యుటిఎఫ్ సంపూర్ణ మద్దతు

0
0

కర్నూలు జిల్లా ప్యాపిలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, 2020 విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించాలని, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, పెట్రోల్, డీజిల్,గ్యాస్,ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని,బిజెపి ప్రభుత్వ కార్మిక,ఉద్యోగ,రైతు, ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలకు నిరసనగా 26న జరుగుతున్న భారత్ బంద్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కావున యుటిఎఫ్ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి,జిల్లా నాయకులు అబ్దుల్ లతీఫ్ పిలుపునిచ్చారు. ప్ర స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పాఠశాల అనంతరం యుటిఎఫ్ ప్యాపిలి మండలశాఖ గౌరవాధ్యక్షులు శేషయ్య అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన నరసింహారెడ్డి మరియు లతీఫ్ మాట్లాడుతూ భారత్ బంద్ కార్యక్రమానికి యుటిఎఫ్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల రీ గ్రూప్ స్కేల్ సాధించుటలో కానీ,Apprentis విధానం రద్దు చేయించడంలో గానీ,నోషనల్ ఇంక్రిమెంట్లు సాధించడంలో కానీ యుటిఎఫ్ పోషించిన పాత్ర మరవలేనిది అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనకు అడ్డు పడుతున్న యాప్ లను తొలగించాలని డిమాండ్ చేశారు.దీనివల్ల బోధన కుంటు పడే అవకాశముంది అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here