Home AP సిపిఎం పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం

సిపిఎం పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం

0
0

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం  ఎచ్చెర్ల. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తున్న చిలకపాలేం యం.పి.టి.సి. సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరాడ.రమణమ్మను గెలిపించాలని సిపిఎం జిల్లా co పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న చిలకపాలేం యం..పి.టి.సి. సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరాడ.రమణమ్మ గారిని సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మంగళవారం చిలకపాలేం యంపీటీసీ పరిధిలోని అవనాపుపేట,దొంకొల కళ్ళం, మునిపేట, గుడాల గుడ్లు,కంసాలి వీధిలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపురం భూములను తరతరాలుగా సాగుచేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని,చిలకపాలేం సమగ్రాభివృద్ధికై నికరంగా పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here