Home AP సకల జల జీవరాసులకు జలమే జీవనాధారం

సకల జల జీవరాసులకు జలమే జీవనాధారం

0
0

కర్నూల్ జిల్లా ప్యాపిలి పట్టణంలో గ్రామా పంచాయితీ లో జెడ్పిటిసి బొరెడ్డి శ్రీరామ్ రెడ్డి,ఈఓఆర్డీ వెంకట్ రెడ్డి,సచివాలయం పంచాయితీ ప్రధాన కార్యదర్శి లు ప్రపంచ నీటి దినోత్సవం సంధర్బంగా ప్రతిజ్ఞ చేసారు.
ఈ సందర్భంగా జెడ్పిటిసి బొరెడ్డి శ్రీ రామ్ రెడ్డి మాట్లాడుతు.
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సకల జల జీవరసుసులకు జలమే మూలం అన్నారు జీవనాధారం గురించి వివరించారు. నీటి వినియోగము గురించి వివరిస్తూ భూగోళం మూడు వంతులు నీటితో నిండి ఉందని దీనిలో మూడు శాతము మాత్రమే మంచినీరు, 97శాతము ఉప్పునీరు ఈ మూడు శాతం నీటి లో కేవలం 0.26 శాతము మాత్రమే మానవాళి వినియోగానికి ఉపయోగకరము అని అన్నారు.ఈ నీరు భూమి ఉపరితలంలో నదులు కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సులు, భూగర్భజల రూపంలో ఉన్నదని అన్నారు. సురక్షిత నీరు పొందాలంటే కలుషిత నీరు దుష్పరిణామాలు గ్రహించాలన్నారు త్రాగునీటి కలుషిత నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ నీటి వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాన నీటిని సంరక్షణ కార్యక్రమాలను చేపట్టి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో
సర్పంచ్ చెవిటి లక్ష్మీదేవి, ఎపిఓ వెంకటేశ్వలు,వార్డు నెంబర్లు ఎస్కె వలీ, నిజం,మరియు వాలేంటర్లు,మొదలగువారు పాల్గొన్నారు.
ప్రజనేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here