Home AP వైయస్ఆర్ భీమా పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి

వైయస్ఆర్ భీమా పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి

0
0

వైయస్ఆర్ భీమా పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” గారు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే స్వగృహం నందు (12-1- 2021) తేదీన పట్టణంలోని స్థానిక 30వ వార్డులో గొల్ల కృష్ణ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడం జరిగింది. అయితే బ్యాంకు నందు ఆయన యొక్క వైయస్సార్ బీమా ప్రీమియం చెల్లించడం జరగలేదు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటు వంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి వైయస్ఆర్ బీమా నమోదు చేయించి వారికి కావాల్సినటువంటి అన్ని దరఖాస్తులను సమర్పించడం పట్ల ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు ఆయన యొక్క భార్య లక్ష్మికి అక్షరాల రెండు లక్షల రూపాయలు (200000) ఆమె అకౌంట్ కు నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా 30వ వార్డు కౌన్సిలర్ చెన్నమ్మ గారు, ఇన్ ఛార్జ్ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతులు మీదుగా వైయస్ఆర్ భీమా మంజూరు పత్రాన్ని ఆయన భార్య లక్ష్మీ గారికి అందజేశారు. ఈకార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మల్లికార్జున గారు తదితరులు ఉన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here