Home AP రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి

0
0

వెల్దుర్తి మండల కేంద్రంలోని సిఐటియు ఎఐటియుసి ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన బందులో భాగంగా మండలంలో బందు నిర్వహించారు. ఈ బంద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, సిఐటియు మండల నాయకులు రాజు, ఏఐటియుసి ఆటో యూనియన్ నాయకులు మాధవ స్వామి మాట్లాడుతూ వెల్దుర్తి పట్టణంలోని షాపులు మరియు ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 రకాల హక్కులను కేవలం నాలుగు కోడలు గా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ, నూతన మోటార్ వెహికల్ యాక్ట్ నేను రద్దు చేయాలని అని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని , ఇన్సూరెన్స్ రంగం 74% ఎఫ్డీఐలను వ్యతిరేకిస్తూ, బ్యాంకులు , ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాలు ప్రజా సంఘాలు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు జరిగే బందులో పాల్గొని వారి మద్దతు తెలియజేశారని వారు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి, నిత్యావసర వస్తువుల రేట్లు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, కడపలో ప్రభుత్వరంగంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు ఉద్యోగులు విద్యార్థులు యువకులు ఉద్యమించి నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు హమాలి యూనియన్ మండల నాయకులు మారెన్న, యేసు, పెద్ద ఏసు, పెద్దన్న, సి ఐ టి యు మండల నాయకులు రాముడు, శీను, పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు మండల నాయకులు మధు , వెంకటేష్, దాస్, రామళ్లకోట సిఐటియు నాయకులు రామ నాయుడు, ఏ ఐ టి యు సి ఆటో యూనియన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here