Home AP రాకపోకలకు వీలులేని రీతిలో అధ్వాన్నంగా రోడ్లు

రాకపోకలకు వీలులేని రీతిలో అధ్వాన్నంగా రోడ్లు

0
0

తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి రహదారి కంకర లేచి, రాకపోకలకు వీలులేని రీతిలో అధ్వాన్నంగా మారింది. గత నాలుగేళ్లుగా రోడ్డు నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖ విస్మరించడంతో కొమ్మిరెడ్డిపల్లి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నిధులు మంజూరయ్యాయని హడావుడిగా రహదారి పనులు ప్రారంభించిన అధికారులు అర్ధాంతరంగా ఎందుకు నిలిపి వేశారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే రోడ్ నిర్మాణం ప్రారంభించాలని గ్రామస్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here