Home AP మహిళల రక్షణ కొరకు దిశ వాహనాలు ఎస్ఐ రవీంద్రారెడ్డి

మహిళల రక్షణ కొరకు దిశ వాహనాలు ఎస్ఐ రవీంద్రారెడ్డి

0
0

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మహిళల రక్షణకై దిశ వాహనాలను ఏర్పాటు ఏర్పాటు చేయబడ్డాయి అని ఎస్ఐ రవీంద్రారెడ్డి అన్నారు.గిద్దలూరు పట్టణంలోని పాఠశాలలు కళాశాలల వద్ద ఆకతాయిల ఆట కట్టించేందుకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాలతో విద్యార్థినిల మహిళల భద్రత కొరకు దిశ వాహనాలతో నిరంతరం పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుందని ఈవ్ టీజింగ్ పాల్పడుతూ విద్యార్థినిల మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిల అల్లరి మూకలను ఆట కట్టించేందుకు నిర్భయంగా దిశ పోలీసులని ఆశ్రయించవచ్చని…మీకు ఎల్లవేళల దిశ పెట్రోలింగ్ వాహనం లో మహిళ పోలీసులు మీకు సహాయం చేసేందుకు మీ సమీపంలోనే తిరుగుతూ ఉంటారని ఎవరైనా ఆకతాయిలు మీ వెంటపడుతూ ఈవ్ టీజింగ్ పాల్పడుతుంటే 9642172838/9490268854/9966003957 / నంబర్లకు సంప్రదించాలని ఎస్సై రవీంద్ర రెడ్డి అన్నారు.అలానే ఫిర్యాదు చేసిన విద్యార్థినిల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈవ్ టీజింగ్ పాల్పడుతున్న ఆకతాయిల పై కఠిన చర్యలు తీసుకుంటామని అలానే మహిళా భద్రత కోసం దిశ యాప్ ను ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని SI రవీంద్రారెడ్డి అన్నారు..పి కొండయ్య
ప్రజా నేత్ర రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here